ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా జైలు నుంచి బాపట్ల మాజీ ఎంపి నందిగం సురేశ్ బుధవారం విడుదల అయ్యారు. ఒక హత్య కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న సురేష్‌కు గుంటూరు నాల్గో అదనపు న్యాయమూర్తి మంగళవారం బెయిల్ మంజూరు చేశారు. రూ.పది వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెంలో జరిగిన ఒక దళిత మహిళ హత్య కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తొలుత టిడిపి ఆఫీసుపై దాడి కేసులో, ఆ తరువాత మహిళ హత్య కేసులో మొత్తం ఆయన 145 రోజులు గుంటూరు జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదల అనంతరం గత కొన్ని రోజులుగా కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం విజయవాడ వెళ్లారు.
