ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి నుంచి ఎంపి సీటు రాదన్న అభద్రతా భావంతోనే కేశినేని నాని పార్టీ మారారని మాజీమంత్రి, టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పదవి కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్నటివరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ ఇప్పుడు సన్మార్గుడు అయ్యాడా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులతో లాలూచీ పడి పార్టీకి అన్యాయం చేశారని ఆరోపించారు.
