జెఇఇ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో నారాయణ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

Jun 10,2024 00:35 #college, #JEE Advanced, #naraana

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : జెఇఇ అడ్వాన్స్‌డ్‌ 2024 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సాధించారు. దక్షిణ భారతదేశంలో మొదటి ర్యాంకు సాధించారు. అంతేకాకుండా వివిధ కేటగిరిల్లో 6 ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు సాధించారు. ఓపెన్‌ కేగిరిలో టాప్‌ 20లో 7 ర్యాంకులు, టాప్‌ 100లో 31 ర్యాంకులు సాధించి నారాయణ విద్యార్థులు సత్తాచాటారు.
ఆలిండియా ఓపెన్‌ కేటగిరిలో సందేష్‌ భోగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్‌దీప్‌ మిశ్రా 6వ ర్యాంకు, బాలాదిత్య 11వ ర్యాంకు, రాఘవ్‌ శర్మ 12, సాహు 16, ఆర్యన్‌ ప్రకాష్‌ 17, అమోఫ్‌ు అగర్వాల్‌ 20వ ర్యాంకు సాధించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్‌ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ తెలిపారు. ఒబిసి, పిడబ్ల్యుడి, ఇడబ్ల్యుఎస్‌ కేటగిరీల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు నారాయణ విద్యార్థులే సాధించారన్నారు. అత్యుత్తమ శిక్షణ, రీసెర్చ్‌ ఓరియెంటేడ్‌ ప్రాగ్రామ్స్‌ వల్లనే ఈ ఫలితాలు వచ్చాయనీ, ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి వారు అభినందనలు తెలిపారు.

➡️