నార్సింగ్‌ డ్రగ్స్‌ కేసు.. పట్టుబడ్డ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తమ్ముడు

Jul 16,2024 10:50 #13 members arest, #Drug case, #hydrabad

హైదరాబాద్‌ : ఆఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి ఇండియాలో విక్రయిస్తున్న నెట్వర్క్‌ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో నార్సింగ్‌లో పట్టుకున్న విషకీëం తెలిసిందే. ఈ డ్రగ్స్‌ కేసులో 13 మంది డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారికి డ్రగ్‌ టెస్ట్‌లు చేయగా.. ఆరుగురికి డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. డ్రగ్‌ కేసులో నిందితులను ఎ1 గా అనౌహా బ్లెస్సింగ్‌, ఎ2 గా అజీజ్‌ నోహిమ్‌ ,ఎ3 గా అల్లం సత్య నారాయణ, ఎ4 సనబోయిన వరుణ్‌ , ఎ5 గా మహబూబ్‌ షరీఫ్‌, ఎ6గా అమన్‌ ప్రీత్‌ సింగ్‌లపై ఎన్‌డిపిసి యాక్ట్‌ 27 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

➡️