ప్రజాశక్తి-విజయనగరం కోట : కోవిడ్ సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి వైద్యం అందించారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.బాస్కరరావు కొనియాడారు. మంగళవారం జాతీయ కోవిడ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా … విజయనగరం డిఎంహెచ్ ఓ, ఐఎంఎ అండ్ ఎపిఎన్‌ఎ, విజయనగరం బ్రాంచ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ …. గుర్తు తెలియని రోగంతో వైద్యులు యుద్ధం చేసి ప్రజల ప్రాణాలను కాపాడగలిగారన్నారు. అలాంటి వైద్యుల ప్రాణ త్యాగాలకు గుర్తుగా ఈరోజు నిర్వహించుకోవడం ఎంతైనా అవసరం అన్నారు. వైద్యకళాకాల ప్రిన్సిపల్ పద్మాలీల మాట్లాడుతూ … కోవిడ్ 19 సమయంలో మరణాన్ని కలిగించే వ్యాధి అయినప్పటికీ వైద్యులు ధైర్యం గా ముందుకు వచ్చి వైద్యం అందించడమనేది గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐ ఎం ఎ ప్రెసిడెంట్ జె.సి.నాయుడు, విజయనగరం ఐ ఎం ఎ ప్రెసిడెంట్ డా.అశోక్ , విజయనగరం ఐఎంఎ సెక్రటరీ డా.ఎల్.శ్రీనువాసరావు, ఐఎంఎ మాజీ అధ్యక్షులు, పిపిడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, విజయనగరం ఎంపిఎన్‌ఎ ప్రెసిడెంట్ డా.బిగిరిధర్, విజయనగరం ఎపిఎన్‌ఎ సెక్రెటరీ డా.బి.చంద్రదేవ్ వర్మ , వివిధ నర్సింగ్ స్కూల్ విద్యార్థులు, ఆశావర్కర్లు, వైద్యులు, జిల్లా, పట్టణ వైద్యులు పాల్గొన్నారు.
