- 17 నుంచి 21 వరకు నిర్వహణ
- ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ షన్మోహన్
ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : కాకినాడ జిల్లాలోని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో ఈనెల 17 నుండి 21 తేదీ వరకు నేషనల్ స్కూల్స్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల జరగనున్నాయి. ఈ పోటీల ఏర్పాట్లను కలెక్టర్ షన్మోహన్ గురువారం పరిశీలించారు. స్కూల్ ఇండోర్ స్టేడియం, విద్యార్థులకు వసతి, భోజనం, మరుగుదొడ్లు, ప్రాక్టీస్ గదులు తదితర ఏర్పాట్లు పరిశీలించి.. పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో 28 రాష్ట్రాల నుండి 1,239 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. చెస్ ఆర్బిటర్స్, వాలంటీర్లు 200 మంది, ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థుల తల్లిదండ్రులు, సహాయకులు 800 మంది ఉంటారన్నారు. పోటీల సందర్భంగా క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆర్డీవో కే శ్రీరమణి, జిల్లా క్రీడా సాధికార సంస్థ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, చెస్ ఛాంపియన్షిప్ చైర్మన్, శ్రీ ప్రకాష్ ఎనర్జీ డైరెక్టర్ సిహెచ్ విజరు ప్రకాష్, చెన్నై చీప్ ఆర్బిటర్ పాల్ ఆరోగ్యరాజ్, పెద్దాపురం చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేవివి శర్మ, కార్యదర్శి సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.