Nellore: సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ ప్రారంభ సభ ప్రారంభం

నెల్లూరు : నెల్లూరులో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. పార్టీ సీనియర్‌ నాయకులు పి.మధు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. పార్టీ అఖిల భారత నాయకత్వానికి, అతిరథులకు, పరిశీలకులకు, ప్రతినిధులందరికీ వేదికపై స్వాగతం పలికారు. ఈ ప్రారంభ సభకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ అధ్యక్షత వహించారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, కామ్రేడ్‌ హేమలత, కామ్రేడ్‌ బి.వెంకట్‌, పార్టీ సీనియర్‌ నాయకులు పి.మధు సభా వేదికపై ఆసీనులయ్యారు. ముందుగా ఇటీవల చనిపోయిన మృతవీరులకు సభికులంతా నివాళులర్పించారు.

➡️