వైసీపీకి నెల్లూరు మేయర్ రాజీనామా

ప్రజాశక్తి-నెల్లూరు : వైసీపీకి రాజీనామా చేసిన్నట్లు నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి ప్రకటించారు. ఆమెతో పాటు పోట్లూరి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరు మేయర్ స్రవంతి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డీ ఇచ్చారని తెలిపారు. అంతేగాక మేయర్ ను చేశారని తెలిపారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. శ్రీధర్ రెడ్డి వై.సి.పి.ని వీడినప్పుడు కూడా ఆయసతోనే ఉంటానని స్పష్టం చేశామని తెలిపారు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వై.సీ.పి.లోకి వెళ్ళాల్సి వచ్చిందని అన్నారు. శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారని, అయినా శ్రీధర్ రెడ్డిపై ఒక మాట కూడా మాట్లాడలేదని అన్నారు. తమ తప్పులను శ్రీధర్ రెడ్డీ మన్నించి తమను అక్కున చేర్చుకోవాలని కోరారు.

➡️