చంద్రబాబు కొత్త కాన్వాయ్.. ఫేక్ న్యూస్

Jun 10,2024 16:16 #Chandrababu Naidu, #Fake News

ప్రజాశక్తి-తాడేపల్లి : టిడిపి అధినేత చంద్రబాబు కోసం తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్‌ కార్యాలయం వద్ద  మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.” ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారు. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలన్నీ పాత వాహనాలే. ఎప్పటి నుండో వినియోగిస్తున్నవే అని స్పష్టం చేశారు.” అని పోస్టులో పేర్కొన్నారు.

➡️