న్యాయవాదుల సంక్షేమం కోసం కొత్త రూ.250 స్టాంప్‌

  • రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-అమరావతి : న్యాయవాదుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ రూ.250 స్టాంపుని తీసుకొచ్చింది. న్యాయవాదులు, కక్షిదారులు దాఖలు చేసే కేసులకు సంబంధించిన వకాలత్‌లు, మెమో ఆఫ్‌ ఆపీరియన్స్‌ కోసం ఈ రూ.250 స్టాంప్‌ని వినియోగించాల్సివుంటుంది. బార్‌ కౌన్సిల్‌ ఆఫీసులో శనివారం జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌ నల్లారి ద్వారాకనాథ రెడ్డి, ఉపాధ్యక్షుడు కష్ణ మోహన్‌, ఇతర సభ్యులు ఈ స్టాంప్‌ని ఆవిష్కరించారు. ద్వారకానాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని న్యాయవాద సంఘాలు ఇకపై ఈ రూ.250 స్టాంప్‌ని వినియోగించాలని కోరారు. ఈ స్టాంప్‌లను బార్‌ కౌన్సిల్‌ నుంచి పొందవచ్చునని సూచించారు. వీటి విక్రయం ద్వారా వచ్చిన నిధులను న్యాయవాదులు, వారి క్లర్కుల సంక్షేమం కోసం వినియోగిస్తామని తెలిపారు.

➡️