వీక్షణం ఎడిటర్‌, వేణుగోపాల్‌ నివాసాల్లో ఎన్‌ఐఎ సోదాలు

Feb 9,2024 08:10 #hydrabad, #NIA

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం సోదాలు నిర్వహించింది. హిమాయత్‌నగర్‌లోని వీక్షణం పత్రిక ఎడిటర్‌, ప్రొఫెసర్‌ వరవరరావు అల్లుడు ఎన్‌.వేణుగోపాల్‌ నివాసంలో సోదాలు నిర్వహించింది. వేణుగోపాల్‌ను ప్రశ్నించిన అనంతరం ఆయన కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఎల్‌బినగర్‌ రాక్‌టౌన్‌లో నివాసం ఉంటున్న రవిశర్మ నివాసంలోనూ సోదాలు చేసింది. ఆయన సెల్‌ఫోన్‌తో పాటు సాహిత్యాన్ని ఎన్‌ఐఎ అధికారులు సీజ్‌ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యులు దీపక్‌ను ఇటీవల కూకట్‌పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన సమాచారం మేరకు వేణుగోపాల్‌ నివాసంలో ఎన్‌ఐఎ సోదాలు చేసినట్లు సమాచారం.

➡️