ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు మంచిదే : నీతి ఆయోగ్‌ సమాధానం

May 17,2024 00:19 #Land Titling Act, #niti aayog

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు మంచిదేనని, దీనివల్ల రైతులకు లాభం కలుగుతుందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై జర్నలిస్టు వెంకటేష్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు గురువారం నీతి ఆయోగ్‌ (వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ రిసోర్స్‌ డివిజన్‌) సమాధానం పంపించింది. ఈ చట్టం కింద భూములకు రక్షణ ఉంటుందని, సర్వహక్కులూ ఉంటాయని తెలిపింది. దీనివల్ల భూ పరిపాలన మరింత సులువు అవుతుందని పేర్కొంది. ఈ చట్టంతో భూములు లాక్కునే పరిస్థితి ఉండదని పేర్కొందని వివరించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న నేపథ్యంలో ఈ సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టిడిపి పొత్తుపెట్టుకున్న బిజెపి… ప్రధాని మోడీ నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు అది అన్యాయమైన చట్టం అని చెబుతుంటే నీతి ఆయోగ్‌ మాత్రం మంచి చట్టమని పేర్కొనడం చర్చనీయాంశమైంది.

➡️