తిరుపతి : తాను కనిపించకుండా పోయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తన గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
