అంబేద్కర్‌ విగ్రహం వద్ద షెడ్లు వద్దు

  • ముఖ్యమంత్రికి కెవిపిఎస్‌ లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహం చుట్టుపక్కల వ్యాపార లావాదేవీలకు ఎలాంటి షెడ్లు, బిల్డింగ్స్‌ ఏర్పాటు చెయ్యకుండా చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మంగళవారం లేఖ రాశారు. అంబేద్కర్‌ విగ్రహం, డిజిటల్‌ లైబ్రరీ, రిసెర్చ్‌ సెంటర్‌ ఎంతో అపురూపమని తెలిపారు. దీనిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షించారని పేర్కొన్నారు. ఇప్పుడు అలా కాకుండా తూర్పు వైపున ఉన్న ఖాళీ స్థలంలో డ్వాక్రా బజారు కోసం ప్రభుత్వం షెడ్డు ఏర్పాటు చేయడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

➡️