తెలంగాణ : జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారానికి సంబంధించి రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్ పార్టీ కేసులో ప్రశ్నించాల్సి ఉందని, సోమవారం విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. అడ్రస్ ప్రూఫ్, కేసు సంబంధిత ఆధారాలు సమర్పించాలన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో వెల్లడించారు. మరోవైపు రాజ్ పాకాల హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత విచారిస్తామని జస్టిస్ విజరుసేన్ రెడ్డి తెలిపారు. పోలీసులు అక్రమంగా కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో రాజ్ పాకాల పేర్కొన్నారు.