ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం ఎపి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ విడుదల చేశారు. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా శాశ్వత ప్రాతిపాదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనస్తీషియా విభాగంలో 33 ఖాళీలు, డెర్మటాలజీలో 4, ఎమెర్జీన్సీ మెడిసిన్‌లో 15, ఇఎన్‌టిలో 8, జనరల్ మెడిసిన్‌లో 34, జనరల్ సర్జరీలో 25, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో 9, న్యూక్లియర్ మెడిసిన్‌లో 6, ఒబిజిలో 23, ఆర్థోపెడిక్స్‌లో 19, పిడియాట్రిక్స్‌లో 11, సైకియాట్రిలో 3, రేడియోలజీలో 32, రేడియో థెరపీలో 2, టిబి అండ్ సిడి (పల్మనాలజీ)లో రెండు, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్‌లో 5, ఫోరెన్సిక్ మెడిసిన్స్‌లో 10, మైక్రో బయోలజీలో 35, పథాలజీలో 18, ఫార్మకాలజీలో 24, ఎస్‌పిఎమ్‌లో 11, సిటి సర్జరీలో 11, కార్డియాలజీలో 17, ఎండోక్రైనాలజీలో 4, మెడికల్ గ్యాస్టోఎంట్రాలజీలో 6, మెడికల్ అంకాలజీలో 16, నియోనాటలజీలో 5, నెఫ్రాలజీలో 18, న్యూరో సర్జరీలో 14, న్యూరోలజీలో 12, పీడియాట్రిక్ సర్జరీలో ఆరు, ప్లాస్టిక్ సర్జరీలో 5, సర్జికల్ అంకాలజీలో 10, యురాలజీలో 12, ఆప్తామాలజీలో 14, రేడియోషన్ అంకాలజీలో 8, వాస్క్యులర్ సర్జరీలో 1 చొప్పున ఖాళీలు వున్నట్లు పేర్కొంది. ఆసక్తి వున్నవారు 2024 ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 9వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు.
