పింఛన్ కోసం వెళ్లి వృద్దుడు మృతి

Apr 3,2024 17:09 #death, #old man, #pensions

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : పెన్షన్ కోసం వచ్చి వృద్దుడు మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం, ఎర్ర వారి పాలెంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. నెరబైలు సచివాలయం దగ్గర పింఛను తీసుకోవడానికి వేచి ఉన్న వృద్ధుడు షేక్ అసం సాహెబ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. అతన్నిస్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే లోగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు స్థానికులు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

➡️