వడదెబ్బతో వృద్ధుడి మృతి

May 15,2024 11:42 #Old man died, #sunburn

పెద్దవూర :వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోనీ నాయినవానికుంట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు గ్రామానికి చెందిన కొట్టె బాలయ్య (70) గత రెండు నెలలుగా జ్వరంతో బాధపడుతున్నారు.ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
ఆరోగ్యం కుదుట పడింది. అయితే గత రెండు మూడు రోజులుగా తీవ్రమైన ఎండలు ఉక్కపోత, వడగాడుపుల కారణంగా కడుపులో నొప్పి, వాంతులు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు వెంటనే మంగళవారం రాత్రి సాగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఆపస్మారక స్థితిలోకీ వెళ్ళారు. ఆసుపత్రిలో డాక్టర్లు పరిశీలించి వడదెబ్బవల్లే అప్పటికే మృతి చెందారని తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

➡️