బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

ప్రజాశక్తి-తెనాలి : మైనర్ బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం చినరావూరుకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు ఎస్ కె మీరావలి 11 ఏళ్ల బాలికకు ఐస్క్రీమ్ ఆశ చూపించి ఇంట్లోకి తీసుకు వెళ్ళాడు. బాలికపై లైంగిక దాడికి యత్నించటంతో భయపడిన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరారయ్యాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో వారు కుటుంబ సభ్యులు, బందువులతో కలిసి పట్టణ ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️