13న విజయవాడలో ”సమైఖ్యతా శంఖారావం”

Apr 11,2025 19:17 #Seminar

సభకు భారీగా ప్రజలు తరలి రావాలని వినతి
సొసైటీ ఫర్‌ కమ్యూనల్‌ హార్మొనీ పిలుపు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ” సమైఖ్యతా శంఖారావం” పేరుతో ఈనెల 13న విజయవాడ పిబి సిద్ధార్ధ ఆడిటోరియంలో జరుగనున్న మత సామరస్యంపై జాతీయసదస్సుకు ప్రజలు, మేధావులు, ప్రజాస్వామిక వాధులు, రచయితలు, యువత,కళాకారులు, అభ్యదయవాధులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాలు అత్యధిక సంఖ్యలో తరలి రావాలని సొసైటీ ఆఫ్‌ కమ్యూనల్‌ హార్మొనీ పిలుపునిచ్చింది. విజయవాడ బందరు రోడ్డులోని బాలోత్సవ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత సమైఖ్యతా శంఖారావం పోస్టర్‌ను మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, సొసైటీఫర్‌ కమ్యూనల్‌ హార్మొనీ జాతీయ ఉపాధ్యక్షులు కె. విజయరావుతో పాటు పలువురు నేతలు ఆవిష్కరించారు. అనంతరం వడ్డే శోభనాధ్రీశ్వరరావు మాట్లాడుతూ శంఖారవం సదస్సుకు రాజ్యసభ సభ్యులుచ సాహితీవేత్త, ఎఐసిసి మైనారిటీ విభాగం ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ప్రతాప్‌ ఘడి, సీనియర్‌ జర్నలిస్టు ఆనంద్‌వర్ధన్‌, సుప్రీంకోర్టు న్యాయవాధి ఫ్రశాంత్‌ భూషణ్‌, యుపి మాజీ మంత్రి మోయిద్‌ అహమ్మద్‌, ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్‌ తులసిరెడ్డి, సొసైటీ ఆఫ్‌ కమ్యూనల్‌ హోర్మొనీ జాతీయ ఉపాధ్యక్షులు కె.విజయరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌పాషా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. పౌర హక్కుల నేత ప్రొఫెసరు హరగోపాల్‌ హాజరవుతారన్నారు. దేశంలో చాపకింద నీరులా మత చాందసం విస్తరిస్తోందని, దానిని నిలువరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ఇదే సమయంలో మత సామరస్య శంఖారావాన్ని పూరిధ్దామన్నారు. మతోనాధ్మధ రెక్కలు విచిరిచి, దేశ లౌకిక వారసత్వాన్ని కొనసాగిద్దామని ఆయన పేర్కొన్నారు. వక్ప్‌ బోర్డు సవరణ విషయంలో విపక్షాలతో కానీ, ముస్లిం సంఘాలతో కానీ కేంద్రం చర్చించలేదన్నారు. ఈ బిల్లు చట్ట సవరణ వెనుక మైనార్టీల ఆస్తులను కాజేసే కుట్ర దాగి ఉందన్నారు.
సొసైటీ ఫర్‌ కమ్యూనల్‌ హార్మనీ జాతీయ ఉపాధ్యక్షులు కె. విజయరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతినభూని అధికారాన్న చేపట్టిన అత్యున్నత స్ధాయి వ్యక్తులే రాజ్యాంగంలోని ఆశయాలకు ,లక్ష్యాలకు తూట్లు పొడుస్తుండటం విచారకరమన్నారు. దేశ సమగ్రత, సమైక్యత ప్రమాదంలో పడుతోందని,ప్రజాస్వామ్య వాధులు, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలన్నారు. మత సామరస్యమనేది ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మఅని అన్నారు. చారిత్రకంగా పరిశీలిస్తే రాష్ట్రంలో శతాబ్ధాలుగా మత సామరస్యం నెలకొని ఉన్నట్లు చరిత్ర చెబుతోందన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ దేశం, రాష్ట్రాభివృద్ది కోసం మత సామరస్యమనేది అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్వేషరాజకీయాలు ప్రజాస్వామ్యానికి ఆటంకంగా మారాయన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు మతోన్మోధాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్న పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ధతు తెలుపుతుండటం దురదృష్టకరమన్నారు.మతోన్మాధమనేది మానవాళికి ప్రమాదకరమని బాబూరావు అన్నారు. లౌకికత్వమనేది రాజ్యాంగానికి పునాది అని అన్నారు. సమైఖ్యత, సామరస్యం కోసం పార్టీల కతీతంగా సమైఖ్యతా శంఖారావం పూరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సొసైటీఫర్‌ కమ్యూనల్‌ హార్మొనీ రాష్ట్ర నేతలు డాక్టర్‌ఎంఎ రహిమాన్‌, షఫీ అహమ్మద్‌, బాజీ, సిఐటియు నాయకులు కె.ఉమామహేశ్వరరావు, యువజన నాయకులు సూర్యారావు, ఐద్వా నాయకురాలు శ్రీదేవి, ప్రజానాట్యమండలి నాయకులు అనిల్‌, జన విజ్ఞాన వేదిక నాయకులు జెవివి శ్రీనివాసరావు, సీనియర్‌ రైతు సంఘం నాయకులు వై.కేశవరావు పాల్గన్నారు.

➡️