రెండోరోజూ కొనసాగిన కడప ఎంపి పిఎ విచారణ

  • నేడు విచారణకు రావాలని నోటీసులు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిఎ రాఘవరెడ్డి విచారణ రెండోరోజూ కొనసాగింది. మొదటి రోజైన సోమవారం కడప సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రెండవ రోజైన మంగళవారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో రాఘవరెడ్డి మాట్లాడుతూ.. పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపై యాంటీస్పేటర్‌ బెయిల్‌ నిమిత్తం హైకోర్టును ఆశ్రయించానన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు విచారణకు హాజరయ్యానని తెలిపారు. పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు పోలీసులు 41 నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యానన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సహకరించానని తెలిపారు. విచారణలో భాగంగా మూడవ రోజైన బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని కోరుతూ 41 నోటీసులు జారీ చేశారన్నారు. బుధవారం మరోసారి విచారణకు హాజరవుతానని తెలిపారు.

➡️