అమరావతి : వైసిపి సీనియర్ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఇన్‌కంటాక్స్ అధికారుల సోదాలు మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి.. రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపార సంస్థల్లో, భాగస్వాముల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ సోదాలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. గ్రంధి శ్రీనివాస్ వ్యాపార సంస్థల్లో జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు.