నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు దుర్మరణం

Sep 4,2024 12:40 #Fire Accident, #nelluru

నెల్లూరు: భారీ అగ్ని ప్రమాదం  సంభవించి ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు రూరల్  నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు‌పల్లి శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. టపాకాయలు నిల్వ చేసిన గోడౌన్‌లో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌కు  కాపలాగా ఉన్న వాచ్‌మెన్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు షాట్ షర్క్యూట్‌ తోనే ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విషయం తెలుసుకున్న లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

➡️