ప్రజాశక్తి-గంపలగూడెం (ఎన్‌టిఆర్ జిల్లా) : కిడ్నీ వ్యాధితో ఒకరు మృతి చెందిన సంఘటన ఎన్‌టిఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… వినగడప గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న (తండా)కు చెందిన గుగులోతు సోమిలి (52) గత నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వ్యాధి తీవ్రతరం కావడంతో ఇంటి వద్దే మరణించారు. సోమిలి భర్త కేశ్యా 15 సంవత్సరాల క్రితం ఇదే వ్యాధితో మృతిచెందారు.
