- అల్లు అర్జున్‌ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు తొక్కిసలాటలో మహిళ మృతి
హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప2’ చిత్రం ప్రీమియర్ షో నేపథ్యంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రీమియర్ షో వీక్షించడానికి అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో గాయపడిన రేవతి (39) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు శ్రీతేజ్ (9)కు పోలీసులు సీపీఆర్ చేశారు. అనంతరం బేగంపేట్ కిమ్స్‌కు తరలించారు. థియేటర్ వద్ద దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు.