ఇ-క్రాప్‌లో వాస్తవ సాగుదారులు మాత్రమే నమోదు

Aug 7,2024 23:34 #genuine, #growers, #In e-crop, #registered

ా వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :భూముల వాస్తవ సాగుదారులతో మాత్రమే ఇ-క్రాప్‌ను నమోదు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని వ్యవసాయశాఖలకు సంబంధించిన అధికారులకు ఇ-క్రాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ఇ-క్రాప్‌లో సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవటం ద్వారా వారికి ప్రభుత్వం అందించే అన్ని వ్యవసాయ పథకాలకూ అర్హులు అవుతారని తెలిపారు. పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల అమ్మకాలు ఇలా అన్ని అంశాలకూ ఇ-క్రాప్‌ ప్రామాణికమని తెలిపారు. కౌలు కార్డులు పొందలేక సాగుచేస్తున్న వారిని క్షేత్ర స్థాయిలో నిజ నిర్ధారణ చేసుకుని వారిని వాస్తవ సాగుదారుగా పరిగణించి నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️