హైదరాబాద్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు ‘ఆపరేషన్ రోప్ వే’ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించనున్నారు. మంగళవారం ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్‌వేలలో ఆపరేషన్ రోప్‌ను చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో కలిసి ఆపరేషన్ రోప్‌లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు, షాపులను తొలగించారు.