రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు..

Jun 8,2024 11:30 #garbage tax, #State

అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులచ్చే వరకు వసూళ్లు నిలిపివేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసిన సంగతి తెలిసిందే.

➡️