హైదరాబాద్ : బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని కండక్టర్లు, డ్రైవర్లను తెలంగాణ ఆర్టీసి ఆదేశించింది. ప్రయాణ సమయాల్లో టికెట్ల కోసం ప్రయాణికులు ఇస్తున్న రూ.10 నాణేలు తీసుకోవడం లేదని, దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో కాయిన్స్ తీసుకునేలా సిబ్బందిని ప్రోత్సహించాలని అన్ని డిపోల మేనేజర్లకు ఆదేశాలిచ్చింది.
