నేమకల్లు (అనంతపురం) : నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమది అని ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం నేమకల్లులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ …. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుతున్నానన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని చెప్పారు. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం అని, ఈ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటామన్నారు. హంద్రీనీవాపై రూ.4,500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమది అని సీఎం హామీ ఇచ్చారు.