ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : విజయవాడలో దుర్గాపురంలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రచురించిన ‘విశాఖ ఉక్కుకు ఊతమివ్వని ప్యాకేజీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సిఐటియు ఆలిండియా అధ్యక్షులు డాక్టర్ హేమలత, రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి.నాగేశ్వరరావు, ప్రదాన కార్యదర్శి నర్శింగరావు, విశాఖ జిల్లా అధ్యక్షులు కె.ఎం. శ్రీనివాసరావు, కార్యదర్శి ఆర్ కుమార్ తదితరులు పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు.
