ఎమ్మెల్సీ పదవులకు పల్లా.కడియం శ్రీహరి-పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

Dec 9,2023 13:36 #Brs leaders, #MLC posts, #resignation

తెలంగాణ : ఎమ్మెల్సీ పదవులకు బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్‌ రెడ్డి శనివారం రాజీనామా చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ ఛాంబర్‌లో కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. సుఖేందర్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం 15 రోజులలోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల కమిషన్‌ ఆరు మాసాల లోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీలుగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలు అందజేశారు.

➡️