అస్వస్థతకు గురైన పవన్‌ కల్యాణ్‌

Apr 3,2024 21:59 #JanaSena, #pavan kalyan

– తెనాలి, నెలిమర్ల పర్యటన రద్దు
ప్రజాశక్తి – తెనాలి, నెల్లిమర్ల :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్‌షో, బహిరంగసభ రద్దు అయ్యాయి. విజయనగరం జిల్లా నెలిమర్ల పర్యటన కూడా గురువారం రద్దు అయ్యినట్లు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి లోకం మాధవి తెలిపారు. అనారోగ్యం కారణంగా జనసేన అధినేత పర్యటన రద్దు కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

➡️