ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని పరిధిలో కొత్త రైల్వే లైను నిర్మాణానికి కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలపడం శుభపరిణామమని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఎర్రుపాలెం, అమరావతి నంబూరు మధ్య రైల్వేలైను నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. రాజధానికి వచ్చే ప్రజలకు అధికారులకు ఉద్యుగులతోపాటు అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధాన్యబుద్ధ ప్రాజెక్టు సందర్శనకు వచ్చేవారికి ఈలైను అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
శుభపరిణామం : మంత్రి నారాయణ
అమరావతి రైల్వేలైనుకు అనుమతి రావడం శుభపరిణామమని పట్టణాభివృద్దిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. . కొత్తగా వేసే లైను మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడకు కనెక్టివిటీగానూ ఉంటుందని పేర్కొన్నారు. నాలుగేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి పరిధిలో గత కాంట్రాక్టులన్నీ 15 రోజుల్లో రద్దుచేస్తామని, కొత్తవాటిని పిలుస్తామని పేర్కొన్నారు.