ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళవారం తిరుపతికి వచ్చారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్ వద్ద ఇఒ జె.శ్యామలరావు స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో బస చేశారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం 11.05 గంటలకు మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. బుధవారం రాత్రి తిరుమలలో బస చేస్తారు. అక్టోబర్ 3న సాయంత్రం 4.30 గంటలకు తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలో జరగనున్న వారాహి సభ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.