తిరుమలకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ సతీమణి

ప్రజాశక్తి-తిరుమల : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం గాయత్రి నిలయం వద్ద ఆమెకు టిటిడి అధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో డిక్లరేషన్‌పై ఆమె సంతకం చేశారు. రాత్రికి ఆమె తిరుమలలోనే బస చేశారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తన కుమారుడు మార్క్‌ శంకర్‌ సురక్షితంగా బయటపడడంతో సోమవారం తిరుమల శ్రీవారిని స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించనున్నారు. ఇందుకు టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

➡️