అమరావతి : ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. ఆదివారం ఉపాధి హామీ పనుల గురించి సచివాలయంలో కమిషనర్ కృష్ణతేజ, అధికారులతో పవన్ సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ … ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని అన్నారు. ప్రతి దశలో పనుల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం చేసినట్లుగా పంచాయతీ నిధులను పక్కదారి పట్టించవద్దని అధికారులను హెచ్చరించారు.