ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అన్న క్యాంటీన్లకు ఏ పేరు అయితే బాగుంటుందనే చర్చ క్యాబినెట్‌లో జరిగినట్లు తెలిసింది.ఆ క్యాంటిన్లను ఎన్‌టిఆర్ పేరుతో కొనసాగించాలా? లేక డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే చర్చ నడిచినట్లు సమాచారం. 2019 వరకు ఉన్న విధంగా అన్న క్యాంటీన్లు ఎన్‌టిఆర్ పేరుతోనే కొనసాగించాలని, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు కొనసాగిస్తే బాగుంటుందని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ సూచించినట్లు తెలిసింది. మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ పేరు పెట్టడం వల్ల ప్రతి విద్యార్దికి ఆమె గొప్పతనం తెలుస్తుందని, పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు,దాతృత్వం కలిగిన వారి పేర్లు మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు జరుగుతుందని పవన్‌కల్యాణ్ మంత్రి వర్గ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది.
