ప్రజాశక్తి – తిరుపతి సిటీ:తిరుపతి తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోందని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి బైరాగిపట్టెడలో జరిగిన భక్తుల తొక్కిసలాట ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టిటిడికి స్క్వౌట్స్ మేనేజ్‌మెంట్ బాగా తెలుసు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు భద్రత కల్పించే వ్యవస్థ ఇక్కడ ఉంది’ అని చెప్పారు. వీరు కేవలం 2,500 మందికి రక్షణ కల్పించలేకపోవడం బాధాకరమన్నారు. ‘నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోం దన్నారు. టిటిడి ఇఒ, అడిషనల్ ఇఒ, ఎస్‌పి, చైర్మన్ తప్పనిసరిగా బాధ్యత వహించాలి’ అని చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకుం టామని, నిర్లక్ష్య ంగా వ్యవహరించిన అందరిని వదిలే ప్రసక్తి లేదని, దీన్ని రాజకీయం చేయొద్దని, తిరుమల పవిత్రను కాపాడేందుకు అందురూ కృషి చేయాలని అన్నారు. ఈ ఘటన చాలా బాధాకర మని చెప్పారు. ‘తప్పు జరిగింది. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి, భక్తులకు, ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా’ అని అన్నారు.