పొత్తులపై కేడరుకు పవన్‌ కీలక సూచనలు

Feb 10,2024 14:32 #JanaSena, #pavan kalyan

ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడరుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. జన హితం, రాష్ట్ర సమగ్రాభివద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని పవన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయనీ.. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని స్పష్టం చేశారు. అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

➡️