ప్రశాంతంగా ఇఎపిసెట్‌-2024

May 17,2024 08:03 #EAPSET, #Entrance Exam
  •  మొదటి రోజు 39,886 మంది హాజరు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇఎపిసెట్‌-24 ప్రవేశ పరీక్ష మొదటి రోజు గురువారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షకు 39,886 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇఎపిసెట్‌-24 ఛైర్మన్‌, జెఎన్‌టియు కాకినాడ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జివిఆర్‌ ప్రసాద్‌రాజు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో జరిగిన ఈ పరీక్షలకు అగ్రికల్చర్‌, ఫార్మసీకి సంబంధించి 22,140 మంది విద్యార్థులకు గానూ 19,982 మంది హాజరయ్యారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో.. 21,877 మంది దరఖాస్తు చేసుకోగా, 19,904 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా రెండు సెషన్‌లు కలిపి 39,886 మంది హాజరైనట్లు ప్రసాద్‌రాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు.

➡️