- టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఓ మాఫియాలా తయారై ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గనులు, ఖనిజం, ఇసుక, ప్రభుత్వ స్థలాలు, పేదలు, అటవీ భూములు, ఎర్రచందనం యథేచ్ఛగా దోచుకున్నారని విమర్శించారు. 238 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. పెద్దిరెడ్డిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దిరెడ్డిపై తమ పార్టీ కార్యాలయానికి కూడా పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు వస్తున్నారని తెలిపారు.
గ్రీవెన్స్ నిర్వహించిన కంభంపాటి
టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌రావు టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రామ్‌ప్రసాద్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.