ప్రజాశక్తి-అమరావతి : గతంలోని 5ప్లస్5 భద్రతను 1ప్లస్1కు కుదిస్తూ చిత్తూరు జిల్లా ఎస్‌పి ప్రొసీడింగ్‌ను పుంగనూరు వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. పిటిషనర్‌కు ప్రాణహాని ఉందని, అయితే అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని న్యాయవాది వాదించారు.
