వర్షంతో సేదతీరిన ప్రజలు

May 15,2024 08:58 #rains

ప్రజాశక్తి – తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా) : వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు మంగళవారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షంతో సేదతీరారు. రోజురోజుకీ పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. మంగళవారం కూడా ఎండ తీవ్రంగా కాసింది. అయితే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాతావరం చల్లబడటంతో వృద్ధులు, చిన్నారులు సేద తీరారు. వర్షం కారణంగా మెయిన్‌ రోడ్‌ లో కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి చిన్న చెరువుల్లా దర్శనమిచ్చాయి. దేవరపల్లిలో వాతావరణం ఒక్క సారిగా చల్లబడి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి ముఖ్యంగా కాలనీలో నీరు నిలిచిపోవడంతో రోడ్లు బురదమయం అయ్యాయి దీంతో జనాలు అవస్థలు పడ్డారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలు ఉపశమనం పొందిన కొంత ఇబ్బంది పడ్డారు

➡️