ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పట్టా భూములు, డికెటి భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల మేరకు భూ యజమానులు ఇసుక విక్రయాలు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.