ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం

Dec 9,2024 23:13 #ap weather, #havy rains
  • ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కేంద్రీకృతమైందని, ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించింది. ఈ మేరకు ఆ సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10న అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 11న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. 12న తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని, నెల్లూరు, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. కాకినాడ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

➡️