ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్‌

  •  యనమల, బాలకృష్ణ గైర్హాజరు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం పోటోసెషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌తో పాటు సభ్యులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ఫోటో సెషన్‌ కార్యక్రమం పూర్తయిన అనంతరం శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు, డిప్యూటీ ఛైర్మన్‌ జకియా ఖానమ్‌తో పాటు సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్ససత్యనారాయణ సభ్యులు పాల్గొన్నారు. ఫోటో సెషన్‌కు సీనియర్‌ నేత, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దూరంగా ఉన్నారు. కాగా అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను శాసనసభ స్పీకర్‌ చింత కాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘు రామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు కాఫీని డిప్యూటీ సిఎంకు సిఎం అందించారు.

➡️