- రిటైర్డ్ డిజిపి ఎబి
ప్రజాశక్తి-అమలాపురం, ముమ్మిడిరం : తన జీవితంలో కాళ్లూ, చేతులూ ఆడినంత కాలం సమాజం కోసం పని చేస్తానని తాను ఉద్యోగ విరమణ సమయంలో చెప్పానని, ఆ మాట ప్రకారం రాజకీయాల్లోకి వస్తున్నానని రిటైర్డ్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో, అమలాపురంలో ఆయన ఆదివారం పర్యటించారు. ముమ్మిడివరం మండలం ఠానేలంకలో వైఎస్.జగన్‌పై దాడి కేసులో బెయిల్‌పై ఉన్న నిందితుడు జనుపల్లి శ్రీనుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను వెంకటేశ్వరరావు పరామర్శించారు. శ్రీనుతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని తెలిపారు. అందులో భాగంగానే జనుపల్లి శ్రీనుకు సహకారం అందించేందుకు వచ్చానని చెప్పారు. అక్రమాలు చేసే వారికి జగన్ పెద్దపీట వేస్తారని, తన స్వార్థం కోసం ప్రజలను కులాలు, వర్గాలుగా విభజిస్తారని విమర్శించారు. జగన్ అక్రమాలు, అన్యాయాలను బయట పెడతానని, జగన్ బాధితులకు అండగా ఉంటానని తెలిపారు. తాను పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నానని, ఈ న్యాయ పోరాటం విజయవంతం చేయడానికి ప్రజల మద్దతు కావాలని కోరారు.