నిధుల దుర్వినియోగం అభియోగాలపై పిల్‌

Apr 3,2024 22:02 #AP High Court, #pil

ప్రజాశక్తి-అమరావతి:ఎపి మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో అక్రమాలు, జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధుల దుర్వినియోగం అభియోగాలపై తదుపరి చర్యలను నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య, మెడ్‌టెక్‌ జోన్‌ సిఇఒ జితేందర్‌ శర్మపై రాష్ట్ర ప్రభుత్వం 2021 జిఓ 1645 జారీ ద్వారా తదుపరి చర్యలను నిలిపేసింది. ఈ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ లీడర్‌ దినపత్రిక ఎడిటర్‌ వి వెంకట రమణ మూర్తి దాఖలు చేసిన పిల్‌ను బుధవారం చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేసిన విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

➡️