ఉన్నత విద్యా మండలిలో అక్రమాలపై పిల్‌

Ads subject to Supreme Guidelines
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో నిధుల దుర్వినియోగంపై ఏకసభ్య కమిషన్‌ నివేదిక మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. కర్నూలుకు చెందిన నాగరాజు ఇతరులు వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారణ జరిపింది. ఉన్నత విద్యా మండలిలో నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డు ఐఎఎస్‌ చక్రపాణి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌తో విచారణ చేయించిందని న్యాయవాది ఎంఆర్‌కె చక్రవర్తి చెప్పారు. బాధ్యులను కమిషన్‌ గుర్తించినప్పటికీ చర్యలు లేవన్నారు. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను అక్టోబరు 16కు వాయిదా వేసింది.

➡️